Good News : 3 వేల ఇంజినీరింగ్ ఉద్యోగాలను ప్రకటించిన వాచ్ కంపెనీ

Good News : 3 వేల ఇంజినీరింగ్ ఉద్యోగాలను ప్రకటించిన వాచ్ కంపెనీ

వచ్చే ఐదేళ్లలో 3,000 మంది ఉద్యోగులను నియమించుకోబోతున్నట్లు టాటా గ్రూప్‌ దిగ్గజం టైటన్‌ కంపెనీ వెల్లడించింది.  వీటిలో ఇంజినీరింగ్, డిజైన్, లగ్జరీ, డిజిటల్, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్‌ తదితర విభాగాలలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.  ఐదేళ్ల కాలంలో రూ. 1,00,000 కోట్ల బిజినెస్‌ను అందుకునే బాటలో ప్రయాణిస్తున్నట్లుగా చెప్పింది. ఇందులో భాగంగానే 3,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని అనుకుంటున్నామని వెల్లడించింది.  

ప్రస్తుతం కంపెనీ సిబ్బందిలో 60% మంది మెట్రో నగరాల నుంచి, మిగిలినవారు రెండో, మూడో శ్రేణి పట్టణాల నుంచి ఉన్నారు. ఇంజినీరింగ్‌ సిబ్బందిని వచ్చే  2-3 ఏళ్లలో 50% పెంచుకోవాలని భావిస్తున్నట్లు టైటన్‌ పేర్కొంది. ఏటా జరిగే నియామకాల్లో ప్రాంగణ నియామకాల వాటా 15-18% వరకు ఉండొచ్చని తెలిపింది.  టాటా గ్రూప్, తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ(టిడ్కో) మధ్య భాగస్వామ్య కంపెనీగా టైటన్‌ ఏర్పాటైన సంగతి తెలిసిందే.  

ALSO READ : కంపెనీ మటాష్ : ఇదో దరిద్రమైన ఆటో.. ఎవరూ కొనొద్దు