స్టూడెంట్లతో రాహుల్ ఇంటరాక్షన్ కు పర్మిషన్ ఇవ్వండి

స్టూడెంట్లతో రాహుల్ ఇంటరాక్షన్ కు పర్మిషన్ ఇవ్వండి

హైదరాబాద్: ఓయూ వీసి  ఆర్డర్ ను సవాల్ చేస్తూ ఓయూ జేఏసీ నేతలు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఓయూ విద్యార్థులతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముఖాముఖీకి పర్మిషన్ ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ నెల 7న ఓయూ విద్యార్థులతో రాహుల్ ఇంటరాక్షన్ కు అనుమతి ఇవ్వాలని వీసీని ఎన్ఎస్యూఐ నేతలు కోరగా... రాజకీయ నాయకులకు క్యాంపస్ లో అనుమతిలేదంటూ వీసీ తిరస్కరించారు.  ఓయూ వీసీ పక్షపతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ జేఏసీ నేతలు కోర్టును ఆశ్రయించారు. విద్యార్థులతో రాహుల్ ముఖాముఖీ మాత్రమే ఉంటుందని, పొలిటికల్ మీటింగ్ ఉండదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో ఓయూలో పొలిటికల్, నాన్ పొలిటికల్ మీటింగ్స్ జరిగాయని వారు కోర్టుకు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం...

టీఆర్ఎస్, బీజేపీ వల్లే రైతులకు కష్టాలు

చాలా దేశాలు సంక్షోభంలో ఉన్నా మనం చాలా స్ట్రాంగ్