టీఆర్ఎస్, బీజేపీ వల్లే రైతులకు కష్టాలు

టీఆర్ఎస్, బీజేపీ వల్లే రైతులకు కష్టాలు

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నీటి పాలవుంతోందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో బాధతో విలపిస్తున్న రైతుల వీడియోను రేవంత్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కేసీఆర్ దరిద్రపు పాలనలో రైతుల దయనీయ స్థితి ఇది అంటూ రేవంత్ కామెంట్ చేశారు. రైతు కష్టం క’న్నీటి’ పాలవుతుంటే అయ్యా కొడుకులిద్దరూ ప్లీనరీలు, ఫాంహౌజ్ లో గ్రీనరీల మధ్య సేద తీరుతున్నారు అంటూ కేసీఆర్, కేటీఆర్ ను విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల డ్రామాతో కాలయాపన చేసిన టీఆర్ఎస్ – బీజేపీ ప్రభుత్వాలే ఈ నష్టానికి బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం...

కేయూలో సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల పడిగాపులు

అవినీతి కావాలా? అభివృద్ధి కావాలా?