అవినీతి కావాలా? అభివృద్ధి కావాలా?

అవినీతి కావాలా? అభివృద్ధి కావాలా?

హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడించిన డిక్టేటర్సే నా ముందు మోకరిళ్లారు.. నువ్వెంత కేటీఆర్? అంటూ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. సిరిసిల్లాలో తనపై జరిగిన దాడి గురించి డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వచ్చిన కేఏ పాల్... డీజీపీ అందుబాటులో లేకపోవడంతో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ గూండాలు రాష్ట్రంలో చెలరేగిపోతున్నారన్నారు. ఓ మంత్రిగా ఉంటేనే ఇంత గూండాయిజం చేస్తున్న కేటీఆర్... ఇక సీఎం అయితే రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు.  రాష్ట్రంలో హింస పెరిగిపోతోందన్న ఆయన... రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని కోరారు.  రేపు (గురువారం) హైకోర్టులో పిల్ వేస్తానని పేర్కొన్న పాల్... త్వరలోనే కంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

కేటీఆర్ వల్ల తనకు ప్రాణ హాని ఉందన్న పాల్ ... తనకేమైనా జరిగితే టీఆర్ఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించి ప్రజా శాంతి పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగలు, ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరి పరిస్థితి ఘోరంగా తయారైందన్నారు. ప్రశాంత్ కిషోర్ కు వేల కోట్లు ఇస్తున్న కేసీఆర్ ... ఉద్యోగుల జీతాలు విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. అవినీతి కావాలంటే కేటీఆర్ ను ఎంచుకోవాలని.. అభివృద్ధి కావాలంటే పాల్ ను ఎంచుకోండి అని అన్నారు. లక్షల కోట్ల అప్పు కావాలా లేక లక్ష ఉద్యోగాలు కావాలా అంటూ ప్రశ్నించారు. మే 28న పరేడ్ గ్రౌండ్ లో గర్జన సభను పెడ్తున్నామన్న పాల్... సభకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం...

ఆర్బీఐ కీలక నిర్ణయం..భారీగా పడిపోయిన సెన్సెక్స్

ఆ ఊరిలో 100కి పైగా ఆలయాలు