ఆర్బీఐ కీలక నిర్ణయం..భారీగా పడిపోయిన సెన్సెక్స్

ఆర్బీఐ కీలక నిర్ణయం..భారీగా పడిపోయిన సెన్సెక్స్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లనుపెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4.40 శాతానికి చేరింది. దీంతో వడ్డీ రేట్లు పెరగనున్నాయి. కొద్ది సేపటి క్రితం జరిగిన బోర్డు మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. చాలా కాలంగా వడ్డీ రేట్లను యదాతథంగా ఉంచుతోంది ఆర్బీఐ. ఇప్పుడు సడెన్ గా వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

ఆర్బీఐ వడ్డీరేట్లు ప్రకటించనుందన్న వార్తలతో ఉదయం నుంచే స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ తీవ్రంగా నష్టపోయాయి. సెన్సెక్స్ 970 పాయింట్లకు పైగా, నిఫ్టీ దాదాపు 300 పాయింట్లు నష్టపోయింది. ఇప్పటికీ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి మార్కెట్లు మరింత నష్టపోయే అవకాశముందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.