ఈటలకు ఓయూ జేఏసీ మద్దతు

ఈటలకు ఓయూ జేఏసీ మద్దతు

ఈటల రాజేందర్  సహకరించకుంటే తాము ఉద్యమం చేసేవాళ్లం కాదన్నారు ఓయూ జేఏసీ ఛైర్మన్ పుల్లారావు యాదవ్. ఈటలపై అవాకులు చెవాకులు పేలితో ఊరుకోబోమన్నారు. ఈటల రాజేందర్ కు విద్యార్థి శక్తి, ఉద్యమకారులు అండగా ఉన్నారన్నారు. ఈటల హుజురాబాద్ కే కాదని..తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రతినిధి అన్నారు. ఈటలను హుజురాబాద్ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టేందుకు బాటలు వేయాలన్నారు.

దమ్ముంటే కేసీఆర్ స్వయంగా హుజురాబాద్ లో ఈటల రాజేందర్ పై పోటీ చేయాలన్నారు ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్. లేదంటే  కేటీఆర్ ను రాజీనామా చేయించి హుజురాబాద్ నుంచి పోటీ చేయించాలన్నారు. లేదంటే హరీశ్ రావైనా పోటీచేయాలన్నారు.  దండుపాళ్యం దండులాగా టీఆర్ఎస్ నేతలు హుజురాబాద్ లో తిరుగుతున్నారన్నారు. కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. దొర రాసిచ్చిన స్క్రిప్టును కౌశిక్ రెడ్డి చదువుతున్నాడన్నారు. రాసలీలల ఆరోపణలున్న గంగుల కమలాకర్ కూడా హుజురాబాద్ లో ప్రచారం చేస్తున్నాడన్నారు. ఎస్సీ, ఎస్టీలపై వ్యతిరేకంగా మాట్లాడిన చల్లా ధర్మారెడ్డి కూడా ఓట్లడుగుతున్నాడన్నారు. ఉస్మానియా విద్యార్థులంతా ఈటలకు అండగా ఉంటామన్నారు.