హోంగార్డు కుటుంబానికి రూ. 2.25 లక్షల ఆర్థికసాయం

హోంగార్డు కుటుంబానికి రూ. 2.25 లక్షల ఆర్థికసాయం

ఓయూ,వెలుగు : హోంగార్డు కుటుంబానికి ఓయూ పోలీసులు ఆర్థికసాయం అందించారు. ఎం.సుధాకర్​ హోంగార్డు గా ఓయూ పీఎస్ లో చేస్తూ గత ఫిబ్రవరి 28న గుండెపోటుతో చనిపోయాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలతో పాటు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు.

సుధాకర్ ​ఆకస్మిక మృతితో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఓయూ, నల్లకుంట ట్రాఫిక్​ పోలీసులు విరాళాలు సేకరించి రూ.2.25లక్షల నగదును ఓయూ డివిజన్​ ఏసీపీ జగన్​చేత బుధవారం సుధాకర్​ కుటుంబానికి అందజేశారు.