అధికారంలో ఉందని మోదీ సర్కార్ ఇష్టం వచ్చినట్టు చేస్తోందని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన..ఉపాధీ హామీ పథకంలో మహాత్మగాంధీ పేరు మార్పు బీజేపీ కుట్ర అని అన్నారు. ఉపాధి హామీ పథకం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని చెప్పారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు మోదీ సర్కార్ కుట్ర చేస్తోందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నట్టే పోరాటం చేయాలన్నారు. వీబీ జీ రామ్ జీ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని అన్నారు రేవంత్.
ALSO READ : హైదరాబాద్ లో చైనా మాంజాపై పోలీసుల ఫోకస్..
సీఎం రేవంత్ ప్రసంగంలోని కీలక వ్యాఖ్యలు
- ఉపాధీ హామీ పథకంతో విప్లవాత్మక మార్పులొచ్చాయి
- రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర
- పేదలకు అన్యాయం చేసేందుకు మోదీ సర్కార్ చర్యలు
- బ్రిటీష్ పాలన తరహాలో బీజేపీ పాలన
- కాంగ్రెస్ అడ్డుకోవడంతోనే బీజేపీ రాజ్యాంగం మార్చలేదు
- పేదలకు ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ పథకం తెచ్చింది
- పేదల ఆత్మగౌరవం పెంచేందుకు సోనియా పథకం తెచ్చారు
- మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం తెలుగు రాష్ట్రంలోనే ప్రారంభమైంది
- పేదల ఆహా భద్రతలకు కాంగ్రెస్ పథకాన్ని తెచ్చింది.
- ఈస్ట్ ఇండియా తరహాలో బీజేపీ పాలన
- పేదలు, పౌరుల కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉంది
- రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నట్టే పోరాటం చేయాలి
- వీబీ జీ రామ్ జీ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా పోరాటం చేస్తా
- కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశాం
- జనవరి 20 నుంచి 30 వరకు ప్రతీ గ్రామంలో సభ నిర్వహిస్తాం
- కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభల్లో తీర్మానం చేస్తాం
- జాతీయ ఉపాధీ హామీ పథకాన్ని పునరుద్దరించాలి
- ఉపాధీ హామీ పథకం లేకుంటే మళ్లీ వలసలు మొదలవుతాయి
- ప్రతీ మండలంలో ముఖ్య నేత బాద్యతలు తీసుకోవాలి
- పేదలను అంబానీ,అదానీలకు కూలీలుగా మార్చేందుకు కుట్ర
- రాష్ట్రంలోని 12 వేల గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేసి పంపుతాం
- ఉపాధీ హామీ పథకంలో గ్రామాల్లో వలసలు తగ్గాయి
- చట్టాన్నిరద్దు చేయాలని లక్ష మందితో ఉద్యమం చేద్దాం
- ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రమాదంలో పడేస్తోంది.
- బడ్జెట్ సమావేశాల్లో గట్టిగా నిలదిద్దాం
- చట్టం పునరుద్దరించే వరకు మనమంతా పోరాటం చేయాలి
- ఏ ఎన్నికలు వచ్చినా కంగ్రెస్ దే విజయం
- కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ , గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనమే గెలిచాం
- త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనమే గెలవాలి
- కార్యకర్తల శ్రమతోనే మేమంతా పదవుల్లో ఉన్నాం
- పదేళ్లు పార్టీ కోసం పని చేసిన వారికే పదవులు
- బీఆర్ ఎస్ సభ్యులు అసెంబ్లీకి రావడం లేదు
- బీఆర్ఎస్ నేతలకు జనం సమస్యలు పట్టవు.
- కష్టపడిన వారికి పదవులు వస్తాయనడానికి సీతక్క ఉదాహరణ
- స్థానిక సంస్థలో కాంగ్రెస్ ప్రజాప్రతినిదులు ఉంటేనే అభివృద్ధి
- పార్టీ లైన్ దాటి పనిచేస్తే చర్యలు తప్పవు
- పార్టీ బీఫాం ఇస్తే అందరు కలిసి పనిచేయాల్సిందే
- గాంధీ కుటుంబాన్ని కేంద్రం ఎన్నో రకాలుగా వేధిస్తోంది
- రాహుల్ పై ఈడీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకున్నారు
- రాహుల్ నేతృత్వంలోనే దేశంలో ప్రగతి సాధ్యం
- రాహుల్ ను ప్రధానిని చేసేందుకు మనమంతా కృషి చేయాలి
