మమతా బెనర్జీ vs ఈడీ: ఐ-ప్యాక్ ఆఫీసు పై ఈడీ దాడులు.. కోల్‌కతాలో ముదురుతున్న పొలిటికల్ హీట్..

మమతా బెనర్జీ vs  ఈడీ: ఐ-ప్యాక్ ఆఫీసు పై ఈడీ దాడులు.. కోల్‌కతాలో ముదురుతున్న పొలిటికల్ హీట్..

మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం దాడులు నిర్వహించడంతో కోల్‌కతాలో హై డ్రామా బయటపడింది. 

సెంట్రల్ కోల్‌కతాలోని సీనియర్ ఐ-ప్యాక్ కార్యకర్త ప్రతీక్ జైన్ ఇంట్లో సహా సాల్ట్ లేక్‌లోని సెక్టార్ Vలోని గోద్రేజ్ వాటర్‌సైడ్ భవనంలో  సంస్థ కార్యాలయంలో ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. దాడుల వార్త వ్యాపించడంతో టిఎంసి లీడర్లు సాల్ట్ లేక్ ఆఫీస్ బయట ఒక్కసారిగా గుమిగూడారు. ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో బిధాన్‌నగర్ పోలీస్ కమిషనర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  

ALSO READ : గిరిజన వర్గాల హక్కులను కాపాడాలి..

ఈడీ అధికారులు పార్టీకి చెందిన రహస్య పత్రాలను, అభ్యర్థుల లిస్ట్స్, ఎన్నికల వ్యూహాల పేపర్స్  దొంగిలించారని ఆమె మమతా బెనర్జీ ఆరోపించారు. ఇది దర్యాప్తు కాదు, దొంగతనం అని ఆమె మండిపడ్డారు.  ఈ దాడుల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారని, తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలను తెలుసుకోవడమే వారి లక్ష్యమని ఆమె ఆరోపించారు. ఈ దాడులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని  పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.

 అయితే ఈ దాడులకు ఎన్నికలకు సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసింది. బొగ్గు అక్రమ రవాణా ద్వారా వచ్చిన డబ్బును 2022 గోవా ఎన్నికల కోసం ఐ-ప్యాక్ సంస్థకు మళ్లించారని, ఆ కేసుకు సంబంధించిన ఆధారాల కోసమే సోదాలు చేశామని ఈడీ తెలిపింది. అంతేకాకుండా, తాము సోదాలు చేస్తున్నప్పుడు కొందరు కీలక వ్యక్తులు వచ్చి అక్రమంగా మా దగ్గర ఉన్న పత్రాలను లాక్కున్నారని ఈడీ ఎదురుదాడి చేసింది.

ALSO READ : మహిళలు జాబ్ చేయడానికి ఇండియాలో బెస్ట్ సేఫ్ సిటీ ఇదే..

మమతా బెనర్జీ కేంద్ర దర్యాప్తు సంస్థల పనిని అడ్డుకుంటున్నారని బీజేపీ నాయకుడు సువేందు అధికారి విమర్శించారు. దర్యాప్తును అడ్డుకున్నందుకు ముఖ్యమంత్రిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సహ వ్యవస్థాపకుడైన ప్రతీక్  జైన్, పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఐటీ సెల్‌కు కూడా హెడ్ గా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన I-PAC, ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత TMC సహా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసింది.