భూసారం పెంపుపై ఓయూ సోషియాలజీ విద్యార్థుల రీసెర్చ్

భూసారం పెంపుపై ఓయూ సోషియాలజీ విద్యార్థుల రీసెర్చ్

 ఓయూ, వెలుగు:  రైతులు తమ భూముల్లో ఎలాంటి పంట వేయాలనే అవగాహన లేకపోవడంతోనే ఆశించిన మేర దిగుబడి రాక అప్పుల పాలు అవుతున్నారని ఓయూ సోషియాలజీ విభాగపరిశోధనా విద్యార్థి కత్తెరసాల శ్రీనివాస్​ తెలిపారు. పంట భూములను కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించేందుకు ‘ సుస్థిర వ్యవసాయ రంగం’ చాలా అవసరమని పేర్కొన్నారు. తన పరిశోధనలో భాగంగా ఆయన ఆదివారం జనగామ జిల్లా కోలుకొండ గ్రామానికి వెళ్లి పలు రకాల వ్యవసాయ కమతాలను సందర్శించి రైతులతో చర్చించారు.