టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. ఓయూలో రాస్తారోకో

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. ఓయూలో రాస్తారోకో

రాష్ట్రంలో టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారం దమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఎస్పీ ఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయాలని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్, ఓయూ జేఏసీ కొత్తపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఓయూ బహుజన విద్యార్థి సంఘాల నాయకులు ఓయూలో రాస్తారోకో నిర్వహించారు. 

ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పేపర్ లీకేజీ ప్రధాన సూత్రధారణ ప్రవీణ్ ను అరెస్టు చేసి అతన్ని విచారించాలని డిమాండ్ చేశారు, ప్రవీణ్ విచారిస్తే ఆయన వెనుక ఉన్న బీఆర్ఎస్ నేతలు బయటకు వస్తారని ఈ సందర్భంగా విద్యార్థులు తెలిపారు. పేపర్ లీకేజీపై చైర్మన్ జనార్దన్ రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.