
ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) వెబ్సైట్ 27 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి ఈ సైట్ సేవలు స్టూడెంట్లు వినియోగించుకోవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాల స్టూడెంట్స్‌తో పాటు విదేశీ విద్యార్థులు వర్సిటీలోని కోర్సులు, అడ్మిషన్స్ ఇతర వివరాలను వారి భాషల్లో పొందొచ్చు. జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, మంగోలియన్, పర్షియన్, చైనీస్, హంగేరియన్, ఇండోనేషియన్ తదితర భాషల్లోనూ సైట్‌ను చూడొచ్చు. ఓయూలో చదివేందుకు వచ్చే దాదాపు 90 దేశాల విదేశీ స్టూడెంట్స్ కోసం ఈ మల్టీ లింగ్వల్ సేవలు ఉపయోగపడతాయని ఓయూ వీసీ ప్రొ. రవీందర్ యాదవ్, సైట్ డిజైన్ టీం డైరెక్టర్ నవీన్‌కుమార్ తెలిపారు.