సోవియట్ కాలం నాటి పాత మిగ్ 21 ఫైటర్ జెట్ లకు కాలం చెల్లినట్లే..

సోవియట్ కాలం నాటి పాత మిగ్ 21 ఫైటర్ జెట్ లకు కాలం చెల్లినట్లే..

న్యూఢిల్లీ : సోవియట్ కాలం నాటి పాత మిగ్ 21 ఫైటర్ జెట్ లకు మన ఎయిర్ ఫోర్స్ 2025 కల్లా గుడ్ బై చెప్పనుంది. ఆ తర్వాత 2027 నాటికి మిగ్ 29 జెట్ లనూ సర్వీస్ నుంచి ఉపసంహరించుకోనుందని వాయుసేన వర్గాలు వెల్లడించాయి. మిగ్ 21 ఫైటర్ స్క్వాడ్రన్ లకు రిటైర్మెంట్ ఇచ్చేందుకు ఐఏఎఫ్ మూడేండ్ల టైమ్ లైన్ రెడీ చేసిందని తెలిపాయి.

ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ లో మూడు స్క్వాడ్రన్ లలో కలిపి 70 మిగ్ 21 ఫైటర్ జెట్ లు ఉన్నాయి. వీటిలో శ్రీనగర్ కేంద్రంగా ఉన్న నెంబర్ 51 స్క్వాడ్రన్​ను సెప్టెంబర్ 30న వాయుసేన ఉపసంహరించుకోనుంది. అలాగే వాయుసేన వద్ద ప్రస్తుతం మూడు స్క్వాడ్రన్​లలో కలిపి 50 మిగ్ 29 జెట్​లు ఉండగా, వచ్చే ఐదేండ్లలో వీటన్నింటికీ రిటైర్మెంట్ ఇవ్వనున్నారు. ఐఏఎఫ్ మోడ్రనైజేషన్ లో భాగంగానే దశల వారీగా పాత విమానాలను పక్కనపెడ్తున్నట్లు వెల్లడించారు.