మా భూములు కబ్జా చేసిండ్రు..ఎమ్మెల్యే ముందే రైతుల ఆందోళన

మా భూములు కబ్జా చేసిండ్రు..ఎమ్మెల్యే ముందే రైతుల ఆందోళన

మెదక్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజా పాలన సమావేశం రసాభసగా మారింది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి ముందు రైతలు ఆందోళనకు దిగారు. తమ భూములు కబ్జాకు గురైనా అధికారులు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి  గ్రామంలో ప్రజాపాలన కార్యాక్రమంలో  ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే మాట్లాడుతుండగా రైతులు ఆందోళన చేశారు. తమ భూములు కబ్జాకు గురయ్యాయని రైతులు ఎమ్మెల్యేను నిలదీశారు. కబ్జాదారులకు తాసిల్దార్ మద్దతిస్తున్నాడంటూ ఆరోపించారు. 10 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.