వ్యాక్సిన్ పై రాజకీయాలొద్దు..టెస్టులే ముఖ్యం

వ్యాక్సిన్ పై రాజకీయాలొద్దు..టెస్టులే ముఖ్యం

కరోనా వ్యాక్సిన్ పై రాజకీయాలొద్దన్నారు ప్రధాని మోడీ. అందరూ టెస్టింగ్ గురించి మరిచిపోయి వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. కరోనా వ్యాప్తిపై అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోడీ.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఫస్ట్ పీక్ ను క్రాస్ చేసిందన్నారు. వ్యాక్సిన్ లేకుండానే ఫస్ట్ వేవ్ ను గెలిచామని... ఇప్పుడు కూడా అదే చేయాలన్నారు. కనీసం 70శాతం RT-PCR టెస్టులు చేయాలన్నారు. ట్రేసింగ్, ట్రాకింగ్ కీలకమన్నారు. ఈనెల 11 నుంచి 14 వరకు వ్యాక్సిన్ ఫెస్టివల్ నిర్వహించే కార్యక్రమాన్ని పరిశీలించాలన్నారు.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారన్నారు మోడీ. ఒక వేళ మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కర్ఫ్యూ విధించాలనుకుంటే రాత్రి 9 లేదా 10 గంటల నుంచి.. ఉదయం 5 లేదా 6 గంటల వరకు పెట్టుకోవచ్చని సూచించారు.

రెండో దశలో కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందని.. కొవిడ్ టీకాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు ప్రధాని మోడీ. వచ్చే మూడు వారాలు భారత్‌కు మరింత కీలకమని తెలిపారు. టెస్టుల విషయంలో నిర్లక్ష్యం, పొరపాట్లు చేయవద్దని సూచించారు. అంతేకాదు మన దేశంలోనే వ్యాక్సిన్ల కొరత లేదని స్పష్టం చేశారు.