ప్రపంచంలో 15 వేడి ప్రాంతాల్లో 10 మనవే

ప్రపంచంలో 15 వేడి ప్రాంతాల్లో 10 మనవే
  • వెల్లడించిన ఎల్‌ డొరాడో వెబ్‌సైట్‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు అదరగొడుతున్నాయి. రెండు మూడు రోజులుగా అత్యధిక టెంపరేచర్లు నమోదవుతున్నాయి. కాగా 24 గంటల్లో అత్యధిక టెంపరేచర్లు నమోదైన 15 సిటీల్లో 10 మన దేశంలోనే ఉన్నాయని, పాకిస్తాన్‌లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ పర్యవేక్షణ వెబ్‌సైట్ ఎల్ డొరాడో తెలిపింది. వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం మంగళవారం రాజస్థాన్‌లోని చురులో 50 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా.. ఢిల్లీలో 47.6, బికనెర్‌‌ 47.4, గంగానగర్‌‌ 47, ఝాన్సీ 47, పిలానీ 46.9 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్‌‌ నమోదైంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌‌ సోనేగావ్‌లో 46.8, అకోలాలో 46.5 డిగ్నీల సెల్సియస్‌ నమోదైంది. యూపీలోని ఝాన్సీతో పాటు బాందాలోనూ టెంపరేచర్లు ఎక్కవగా ఉన్నాయి. హరియాణాలోని హిసార్‌‌ కూడా అత్యధిక టెంపరేచర్లు నమోదైన నగరాల్లో ఒకటి. 2016 మే19న కూడా చురులో టెంపరేచర్‌‌ 50 డిగ్రీలు దాటిందని అధికారులు చెప్పారు. ఈస్ట్రన్‌ రాజస్థాన్‌లోని కోటా, బుండీ, బికనీర్‌‌, చురు, హనుమాన్‌ఘర్‌‌, శ్రీగంగానగర్‌‌ తదితర ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు.