డెత్​ జోన్ గా ఔటర్ రింగ్ రోడ్డు​

డెత్​ జోన్ గా ఔటర్ రింగ్ రోడ్డు​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ వరకు 214 ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 51 మంది చనిపోయారు. మరో 164 మంది గాయపడ్డారు. విజయవాడ, బెంగళూరు, ముంబై, నాగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవేలకు కనెక్టివిటీగా 156.9 కిలోమీటర్ల పరిధిలో ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. దీని‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రోజూ సగటున 1.44 లక్షల వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. హైవేలకు ఔటర్ కనెక్టివిటీ ఉండటంతో దూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు ఔటర్​ను ఎంచుకుంటున్నారు. రోడ్డు విశాలంగా ఉండటంతో హైస్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దూసుకెళ్తున్నారు. దీంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 

యాక్సిడెంట్లపై స్టడీ.. 
సైబరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఓఆర్ఆర్ ఉంది. మూడేండ్ల యాక్సిడెంట్లపై రెండు కమిషనరేట్లు స్టడీ చేశాయి. ఓవర్ స్పీడ్, డ్రంకన్ డ్రైవ్​తో పాటు నిద్రలేమి కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించాయి. దూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు ఎక్కువగా రాత్రి పూట జర్నీ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ చేరుకునే సరికి అలసిపోతున్నారు. నిద్రలేమితో తెల్లవారుజామున ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ట్రావెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్లు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల టైమ్ లో ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చేటోళ్లు ఎక్కువగా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 5 గంటల టైమ్​లో ప్రమాదాలకు గురవుతున్నారు. 

29 బ్లాక్ స్పాట్స్... 
ఓఆర్ఆర్​పై ప్రమాదాల నివారణకు కార్ల స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గంటకు100 కిలోమీటర్లుగా నిర్ణయించారు. కానీ, ఆ రూల్స్​ను ఎవరూ పాటించడం లేదు. గంటకు150 నుంచి 200కుపైగా కి.మీ. వేగంతో దూసుకెళ్తున్నారు. దీంతో 29 బ్లాక్ స్పాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఓవర్ స్పీడ్​తో వెళ్తున్న వెహికల్స్​పై స్పీడ్ గన్స్​తో 3,91,449 కేసులు రిజిస్టర్ చేసి, ఒక్కో వెహికల్​కు రూ.1,035 చొప్పున ఫైన్​ వేశారు. ఇప్పుడు చలికాలంలో పొగమంచు కారణంగా వెహికల్స్ కనిపించవని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓఆర్ఆర్ పై రూల్స్ పాటించకున్నా, తగిన జాగ్రత్తలు తీసుకోకున్నా ప్రాణ నష్టం తప్పదని హెచ్చరించారు. 

ఔటర్ పై యూత్ చక్కర్లు... 
వీకెండ్స్​లో యూత్ ఓఆర్ఆర్ పై ఎంజాయ్ ట్రిప్స్ వేస్తున్నారు. పార్టీలలో ఎంజాయ్ చేసొచ్చి ఔటర్ పై చక్కర్లు కొడుతున్నారు. డ్రంకన్ డ్రైవ్ చేస్తూ, ఓవర్ స్పీడ్​తో దూసుకెళ్తున్నారు. దీంతో ప్రమాదాలకు గురవుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకునేటోళ్లు ఔటర్ పైనే ట్రయల్స్ వేస్తున్నారు. రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ రూల్స్ , సైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులను ఫాలో కాకుండా ప్రమాదాల బారినపడుతున్నారు. వీరిలో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటున్నారు. 

రూల్స్ పాటించాలి... 
ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ట్రావెల్ చేయడం హాబీగా మారింది. ఓవర్ స్పీడ్, డ్రంకన్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిద్రలేమి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇప్పుడు చలికాలంలో పొగమంచు ముప్పుగా మారనుంది. అందరూ రూల్స్ పాటించాలి. ఓవర్ స్పీడ్ తో వెళ్లే వారిపై లేజర్ గన్స్ తో కేసులు నమోదు చేస్తున్నాం. - ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీసీపీ ట్రాఫిక్, సైబరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌