మంచిర్యాల కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు చెల్లించాలి :  యూనియన్‌ నాయకులు

మంచిర్యాల కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు చెల్లించాలి :  యూనియన్‌ నాయకులు

నస్పూర్, వెలుగు: మంచిర్యాల కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి జీతాలు చెల్లించాలని యూనియన్‌ నాయకులు డిమాండ్​చేశారు. మంగళవారం కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కుమార్​ దీపక్​కు వినతి పత్రం అందించి మాట్లాడారు. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇంటి అద్దెలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చాలీచాలని జీతాలను కూడా టైమ్​కు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. వెంటనే స్పందించి జీతాలు చెల్లించేలా చూడాలన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం వర్కింగ్ ప్రసిడెంట్ సోహెల్ ఖాన్, నాయకులు అవునూరి లింగయ్, బూడిద సాగర్,  లింగయ్య, బాపు, మల్లయ్య, మొగిలి తదితరులు పాల్గొన్నారు.