కేంద్ర విద్యా సంస్థల్లో కొత్తగా 2,14,766 సీట్లు

కేంద్ర విద్యా సంస్థల్లో కొత్తగా 2,14,766 సీట్లు

 10% ఈడబ్ల్యూఎస్ కోటా కింద పెంపు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 158 కేంద్ర విద్యా సంస్థల్లో 2 లక్షలకు పైగా సీట్లు పెరగనున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సోమవారం ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్..ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అడ్మిషన్లలో రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తెలిపింది. ఎలక్షన్​ కోడ్ నేపథ్యం లో.. దీనిపై ఇప్పటికే ఈసీ నుంచి అనుమతి తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘కేబినెట్ తాజా నిర్ణయంతో 2,14,766 అదనపు సీట్లు విద్యాసంస్థల్లో పెరగనున్నాయి. ఇందులో 2019–20 విద్యా సంవత్సరంలో 1,19,983 సీట్లు, 2020–21లో95,783 సీట్లు పెరగనున్నాయి. 158 విద్యా సంస్థల్లో రిజర్వే షన్లను అమలు చేసేందుకు రూ.4315.15 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది” అని చెప్పాయి.