భారీ వరదలు.. 200 కార్లు మునిగిపోయాయి

భారీ వరదలు.. 200 కార్లు మునిగిపోయాయి

యూపీలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. హిండన్ నది(యమునా నదికి ఉపనది) ప్రమాదస్థాయిని మించి ప్రవహింస్తుండటంతో నోయిడాను వరద ముంచెత్తింది. హిండన్ నది నీటి మట్టం పెరగడంతో  దాని ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. సమీపంలో ఉన్న ఇళ్ల నుంచి చాలా మందిని ఖాళీ చేయించారు. 

 గ్రేటర్ నోయిడాలోని  ఎకోటెక్ -3లోని  వందల(దాదాపు200లకు పైగా) కార్లు మునిగిపోయాయి.  ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియలో వైరల్ గా మారింది. వరుసగా  పార్కింగ్ చేసిన తెల్లటి  కార్లు దాదాపు నీటిలో మునిగిపోయాయి. కేవలం  టాప్ మాత్రమే కనిపిస్తోంది

మరో మూడు రోజులు యూపీలో వర్షాలుంటాయని అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా తలపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలకు అలెర్ట్ జారీ చేశారు అధికారులు.