వైమానిక దాడుల్లో ఒకేసారి 200 మంది తాలిబన్లు హతం

V6 Velugu Posted on Aug 08, 2021

ఆఫ్ఘనిస్తాన్‌: తాలిబన్లు లక్ష్యంగా భద్రతా బలగాలు చేసిన వైమానిక దాడుల్లో 200 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని  షెబెర్గాన్ నగరంలో తాలిబన్లు సమావేశాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆఫ్ఘన్ ఎయిర్ ఫోర్సెస్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో 200 మందికి పైగా తాలిబన్లు చనిపోగా.. 100కి వాహనాలు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా పెద్దమొత్తంలో ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి కూడా పేలిపోయింది. 

ఈ ఘటనను నిర్దారిస్తూ ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఫవాద్ అమన్ ట్వీట్ చేశారు. ‘శనివారం సాయంత్రం షెబెర్గాన్ నగరంలో 200 మందికి పైగా తీవ్రవాదులు మరణించారు. వారిని లక్ష్యంగా చేసుకొని B-52 బాంబర్ ద్వారా దాడి చేశాం. వైమానిక దాడుల ఫలితంగా వారి ఆయుధాలు, మందుగుండు సామగ్రి మరియు వారికి చెందిన వాహనాలు 100కి పైగా ధ్వంసమయ్యాయి’ అని ట్వీట్ చేశారు.

Tagged Afghanistan, Talibans, airstrikes, Taliban Terrorists, air forces, Shebergan, Fawad Aman

Latest Videos

Subscribe Now

More News