నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నడిచే బస్తీ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న ఏడు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా అభ్యర్థులు భారీగా తరలివచ్చారు.
4 మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్స్, రెండు సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల కోసం గురువారం 500 మందికి పైగా అభ్యర్థులు కలెక్టరేట్లోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి చేరుకొని దరఖాస్తులు అందజేశారు. స్క్రుటినీ చేసి వివరాలను వెబ్సైట్లో ఉంచుతామని అధికారులు తెలిపారు.- వెలుగు, నిజామాబాద్ ఫొటోగ్రాఫర్
