తెలంగాణలోఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో లైసెన్స్ గన్స్ ఉన్న వారందరూ పోలీస్ స్టేషన్ లలో వాటిని అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు వీవీఐపీలతో పాటుగా ఇండియన్ ఆర్మీ సిబ్బందికి కూడా వర్తిస్తుంది, వారు తమ లైసెన్స్ పొందిన తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్‌లలో అందజేయాల్సి చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ తమ వ్యక్తిగత భద్రతకు భంగం కలుగుతుందని భావించే వ్యక్తులు లైసెన్స్ తుపాకులను తమ వద్ద ఉంచుకోవడానికి జిల్లా ఎన్నికల అధికారి లేదా కలెక్టర్ నుండి అనుమతిని కోరాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, సైబరాబాద్ వంటి ప్రముఖ ప్రాంతాలలో లైసెన్స్ పొందిన హోల్డర్లలో ఎక్కువ మంది ఉన్నారు.
పోలీసుల అదేశాల మేరకు 2023 అక్టోబరు 16 నాటికి హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్లలో 7,000 పైగా లైసెన్స్ తుపాకులు అప్పగించబడ్డాయి. ఇంకా అప్పగించని వారికి అదనపు సమయం ఇస్తున్నట్లు బంజారాహిల్స్ ఏసీపీ పి.సుబ్బయ్య తెలిపారు.

