పెషావర్: పాకిస్తాన్‌లోని వాయవ్య సరిహద్దు ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా బలగాలు మెరుపు దాడులు నిర్వహించాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో మూడు రోజులుగా జరిపిన ఆపరేషన్లలో 21 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈమేరకు పాక్ సైనిక మీడియా విభాగం శనివారం వివరాలు వెల్లడించింది.
ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో 72 గంటలుగా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. హతమైన వారిలో నిషేధిత తెహ్రీక్- ఏ- తాలిబాన్ పాకిస్తాన్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ రింగ్ లీడర్లు ఉన్నారు. ఈ ప్రత్యేక ఆపరేషన్లలో గత వారం రోజుల్లో మొత్తం 48 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైన్యం తెలిపింది.
