టైటిల్ ఫైట్‌లో కొట్టుకోవాల్సింది పోయి.. స్టేజ్‌పైనే రొమాన్స్ ఏందక్కా.. ప్రత్యర్థికి ముద్దు పెట్టిన షీనా

టైటిల్ ఫైట్‌లో కొట్టుకోవాల్సింది పోయి.. స్టేజ్‌పైనే రొమాన్స్ ఏందక్కా.. ప్రత్యర్థికి ముద్దు పెట్టిన షీనా

Sheena Bathory: పవర్ స్లాప్ (Power Slap) లీగ్ చరిత్రలోనే తొలిసారిగా జరగనున్న మహిళల ఫెదర్‌వెయిట్ ఛాంపియన్‌షిప్ ఫైట్‌కు ముందు ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌కి ముందు నిర్వహించిన అధికారిక ఫేస్ ఆఫ్ (Staredown) సమయంలో హంగేరియన్ స్టార్ షీనా బాథోరి-సాబో, తన ప్రత్యర్థి యాబీ మోంటేస్ చెంపపై ఒక్కసారిగా ముద్దు పెట్టింది. ఇద్దరు అథ్లెట్లు అత్యంత సమీపంలో నిలబడి ఒకరినొకరు కోపంగా చూసుకుంటున్న సమయంలో, షీనా ఒక్కసారిగా ముందుకు వంగి మోంటేస్‌కు కిస్ ఇచ్చింది. ఈ ఘటనకు మోంటేస్ ప్రశాంతంగా స్పందించినప్పటికీ, అక్కడున్న ఆర్గనైజర్లు, ఫ్యాన్స్ షాక్‌ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

చారిత్రాత్మక ఛాంపియన్‌షిప్ పోరు: 
రేపు (గురువారం, జూలై 30న) జరగనున్న ఈ పోరు పవర్ స్లాప్ చరిత్రలోనే ఓ ప్రత్యేక మైలురాయిగా నిలవనుంది. పవర్ స్లాప్ లీగ్ మొదటి మహిళల ఫెదర్‌వెయిట్ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకోవడం కోసం షీనా బాథోరి, యాబీ మోంటేస్ రింగులో తలపడనున్నారు. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచే అథ్లెట్ తొలి ఛాంపియన్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కనుంది.

ALSO READ : 2027 వరల్డ్‌కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడటం దాదాపు ఖాయం?

మైండ్ గేమా? ఓవరాక్షనా: 
ఈ ఫేస్ ఆఫ్ ఘటన తర్వాత ఇద్దరి మధ్య రౌద్రం, పోటీతత్వం మరింత తీవ్రరూపం దాల్చాంది. షీనా చేసిన ఈ పనికి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని ప్రత్యర్థి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఆడిన తెలివైన సైకలాజికల్ మైండ్ గేమ్ గా అంటుంటే, మరికొందరు మాత్రం క్రీడాల్లో హద్దులు దాటడమేనని అభిప్రాయపడుతున్నారు. కారణం ఏదైనా, ఈ డ్రామాతో రేపు (గురువారం) జరగబోయే ఛాంపియన్‌షిప్ టైటిల్ ఫైట్‌పై ఫ్యాన్స్ లో భారీ హైప్ క్రియేట్ అయింది.