
కొందరికి తినాలని ఉన్నా తినలేరు. తమ ముందూ నోరూరించే వంటకాలు ఉన్నా నోట్లో ఒక్క ముద్ద కూడా పెట్టలేరు. మరికొందరు ఎంత తిన్నా ఆకలి తీరదు. ఏదో ఒకటి అలా నోట్లో వేసి ఆడిస్తూనే ఉంటారు. ఇలా ఆకలి ఎక్కువగా పెరగానికి కారణలు లేకపోలేదు. మన డైలీ తీసుకునే ఫుడ్ లో కొన్నింటిని చేర్చితే.. ఈ అతి ఆకలి సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో చూద్దాం..
ప్రొటీన్
తినే తిండిలో ప్రొటిన్స్ లేకపోతే. ఎంత తిన్నా అంతే సంగతి. అందుకే ఫుడ్‌లో ప్రొటీన్లు ఇంపార్టెంట్. ‘లెప్టిన్’ అనే హార్మోన్ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఇది తక్కువ రిలీజ్ అవడం వల్ల ఆకలివేస్తుంది. దీన్ని కంట్రోల్ చేసేవి ఫుడ్లోని ప్రొటీన్లే. సో! రిచ్ ప్రొటీన్స్ ఉన్న ఫుడ్ తింటే... ఆకలిగా అనిపించదు. టైంకి తింటే సరిపోతుంది. రిచ్ ప్రొటీన్ ఫుడ్‌లో .. గుడ్లు, చేపలు, శనగలు, బాదం వెన్న, పల్లీ, గుమ్మడి గింజల్లో ఫ్యాట్ తక్కువ ఉండి ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి.
నిద్ర
సరిగ్గా నిద్ర లేకపోతే హెల్త్ అన్ని రకాలుగా చెడిపోతుంది. బాడీ, బ్రెయిన్ సరిగ్గా పని చేయాలంటే సరైన నిద్ర ఉండాలి. తగినంత రెస్ట్ తీసుకోకపోతే.. శరీరం గ్రెలిన్ అనే హంగర్ హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది. దీనివల్ల ఆకలి తీవ్రంగా ఉంటుంది. రోజుకు ఏడు నుండి తొమ్మిది గంటలు నిద్రలేకపోతే.. నిండుకుండలా నిండిన పొట్టకి కూడా తిండి పెట్టాల్సిందే.
ఫ్యాట్, ఫైబర్
ఫుడ్లోని ఫ్యాట్, ఫైబర్ గ్రెలిన్ రిలీజ్‌ను తగ్గించి, లెప్టిన్ స్థాయిని పెంచుతాయి. కాబట్టి ఫుడ్‌లో ఫైబర్, ఫ్యాట్ లేకపోతే ఎప్పుడూ ఆకలిగానే ఉంటుంది. కొవ్వు , ఫైబర్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఆకలిని అదుపులో ఉంచుకోవడానికి ఫైబర్, ఫ్యాట్ తప్పనిసరిగా ఉండాలి. ఆలివ్ నూనె, అవిసె గింజలు, బీన్స్, అవకాడో, బెర్రీలు, బ్రకోలీ, పాప్‌కార్న్, యాపిల్స్‌లో తగినంత ఫ్యాట్, ఫైబర్ ఉంటుంది.