
న్యూఢిల్లీ: బంగారం కొనేవాళ్లకు ఇది మంచి సమయం. గడచిన ఏడు రోజుల్లో పసిడి ధరలు రూ.వెయ్యి మేర తగ్గాయి. ఈ ఏడాది ఆగస్ట్ ఎల్లో మెటల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ దాని కిందటి వారం గరిష్ట స్థాయి నుండి దాదాపు రూ.1,000 తగ్గి 10 గ్రాములకు రూ.50,603 వద్ద ముగిసింది. స్పాట్ బంగారం ధర ఔన్స్‌కు 1826 డాలర్ల స్థాయిల వద్ద ముగిసింది. లోహాల ధరలలో బలహీనత కారణంగా, ఎంసీఎక్స్ వెండి ధరలు పోయిన వారంలో 1.95 % వరకు తగ్గాయి. కిలో రేటు రూ.59,749లకు పడిపోయింది. ఎంసీఎక్స్ వెండి ధరలో 2.57% కరెక్షన్ వచ్చింది. ఔన్స్ రేటు 21.11 డాలర్ల వద్ద ముగిసింది. బులియన్ ఎక్స్పర్టుల అభిప్రాయం ప్రకారం, స్పాట్ గోల్డ్‌కు ఔన్స్‌కు1810 డాలర్ల స్థాయుల వద్ద తక్షణ మద్దతు ఉంది. 1770 డాలర్ల స్థాయిలలో బలమైన మద్దతు ఉంది. స్పాట్ వెండికి 20.50 డాలర్ల స్థాయిలలో తక్షణ మద్దతు ఉంది. స్పాట్ సిల్వర్‌కి 20 డాలర్ల వద్ద బలమైన మద్దతు ఉంది. ఎంసీఎక్స్‌లో బంగారానికి రూ.49,900 స్థాయిల వద్ద తక్షణ మద్దతు ఉంది. రూ.49,200 వద్ద బలమైన మద్దతు ఉంది. ఎంసీఎక్స్‌లో వెండికి రూ.58,500 స్థాయిలలో తక్షణ మద్దతు ఉండగా, ఎంసీఎక్స్‌లో వెండికి రూ.56,000 స్థాయిలో బలమైన మద్దతు ఉంది. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌లో రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ పోయిన వారం, ఎంసీఎక్స్ బంగారం ధర 0.42 % తగ్గిందని అన్నారు. వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాల వల్ల గోల్డ్, వెండి ధరలు తగ్గుతున్నాయని చెప్పారు.