సొంత కుటుంబ సభ్యులే వివేకాను దూరం పెట్టారు : షమీమ్

సొంత కుటుంబ సభ్యులే వివేకాను దూరం పెట్టారు : షమీమ్

వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐకీ కీలక అంశాలతో కూడా వాంగ్మూలం సమర్పించారు. ఈ వాంగ్మూలంలో వివేకాతో 2010లో వివాహం అయిందని, 2011లో మరోసారి వివాహం చేసుకున్నామని షమీమ్ వెల్లడించారు. 2015లో తమకు షెహన్ షా జన్మించాడని ఆమె చెప్పారు. వివేకా హత్యకు కొన్ని గంటల ముందు తనతో ఆయన ఫోన్లో మాట్లాడారన్నారు. తమ వివాహం ముందు నుంచీ వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదన్న ఆమె.. -వివేకాకు దూరంగా ఉండాలని సునీతా రెడ్డి కూడా బెదిరించేదని షమీమ్ లో వాంగ్మూలంలో చెప్పుకొచ్చారు.

పలుమార్లు శిప్రకాశ్ రెడ్డి తనను బెదిరించారని షమీమ్ అన్నారు. వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్ కన్నేశారని,- పదవిపై శిప్రకాష్ కు కాంక్ష ఉండేదని చెప్పారు. షెహన్ షా పేరుపై 4 ఏకరాలు కొందామని వివేకా అనుకున్నారు కానీ దాన్ని శివప్రకాశ్ రెడ్డి ఆపేశారని, వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని ఆమె పేర్కొన్నారు.  అన్యాయంగా వివేకా చెక్ పవర్ తొలగించారని ఆరోపించారు. వివేకా ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ తో రూ.8 కోట్లు వస్తాయని వివేకా చెప్పారన్న ఆమె.. హత్యకు కొన్ని గంటల ముందు కూడా ఆ రూ.8 కొట్ల గురించి మాట్లాడారని తెలిపారు.