బాబు కోసం నిజామాబాద్లో తల్లుల ఆరాటం

 బాబు కోసం నిజామాబాద్లో తల్లుల ఆరాటం
  • బిడ్డ తనకే కావాలంటూ కన్నతల్లి, పెంచిన తల్లి గొడవ

నిజామాబాద్లో 4 నెలల వయసున్న చిన్నారి బాబు కోసం ఇద్దరు తల్లుల మధ్య వివాదం తలెత్తింది. స్వప్న, సాయిలు దంపతులు  40 వేల రూపాయలకు తమకు పుట్టిన పసికందును అమ్ముకున్నారు. అయితే 4 నెలల తర్వాత మనసు మార్చుకునన్న స్వప్న తన బిడ్డ తనకు కావాలంటూ పెంచుకుంటున్న  తల్లి సునీత ఇంటికి వచ్చింది. అయితే తాము అల్లారుముద్దుగా బాబును పెంచుకుంటున్నామని.. ఇవ్వలేమని చెప్పడంతో పెంచుకుంటున్న తల్లి సునిత ఇంటిముందు కన్నతల్లి ఆందోళనకు దిగింది.

నిజామాబాద్ లోని ఆనంద్ నగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. బాబు కోసం కన్నతల్లి, పెంచుకుంటున్న తల్లి మధ్య గొడవ పడి పోలీసులను ఆశ్రయించారు. బిడ్డ తనకే కావాలంటూ కన్న తల్లి, పెంచిన తల్లి ఇరువురూ పట్టుబడుతున్నారు. నిజామాబాద్ ఐదో పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కన్న తల్లి. బాబు కోసం కన్నతల్లి, పెంచుకుంటున్న తల్లుల మధ్య గొడవపై ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.

 

ఇవి కూడా చదవండి

మా' తెలంగాణగా నామకరణం చెయ్యాలి

ప్రజల వెసులుబాటు కోసమే కొత్త కోర్టులు

పల్లెప్రగతి సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచులు