ప్రైవేట్​ బడుల్లో సొంత సిలబస్

ప్రైవేట్​ బడుల్లో సొంత సిలబస్
  • సర్కార్ సిలబస్ అమలు చేస్తలే
  • సొంత పాఠాలతో పుస్తకాల ప్రింటింగ్
  • వాటినే కొనాలని ఆర్డర్
  • తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు
  • ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో పలు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీకి కొత్తదారులు వెతుక్కుంటున్నాయి. ఇప్పటికే ఫీజుల పేరుతో పేరెంట్స్ను పీల్చి పిప్పిచేస్తున్న మేనేజ్మెంట్లు... పుస్తకాల పేరుతోనూ భారీగా భారం మోపుతున్నాయి. రాష్ట్ర సర్కార్ చెప్పిన సిలబస్నే స్టూడెంట్లకు చెప్పాల్సిన మేనేజ్మెంట్లు.. సొంతంగా తయారు చేసుకున్న సిలబస్నే పిల్లలకు బోధిస్తున్నాయి. ఆ సిలబస్ కు అనుగుణంగా బుక్స్ తయారు చేసి, వాటినే కొనాలని ఆర్డర్ వేస్తున్నాయి. ఇదంతా తెలిసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. స్టేట్ సిలబస్ స్కూళ్లు ఎస్సీఈఆర్టీ కరికులమ్, సెంట్రల్సిలబస్ స్కూళ్లు ఎన్సీఈఆర్టీ కరికులమ్ వాడాలి. కానీ చాలా స్కూళ్లు ఈ నిబంధనను పట్టించుకోవడం లేదు. సొంతంగా తయారు చేసుకున్న సిలబస్ను స్టూడెంట్స్కు చెప్తున్నాయి. కొన్ని స్కూళ్లలో టెన్త్ వరకు సర్కార్ సిలబస్ చెబుతుండగా.. మిగిలిన అన్ని క్లాసులకు మాత్రం సొంత సిలబస్ నే చెబుతున్నారు. మరోవైపు సమ్మెటివ్, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్కు విద్యాశాఖ నుంచి వచ్చే క్వశ్చన్ పేపర్లనే వాడాలి. కానీ వాటిని ఆయా స్కూళ్లు పెట్టడం లేదు. సొంతంగా పేపర్లు తయారు చేసి, పరీక్షలు నిర్వహిస్తున్నాయి. సిలబస్ పై మేనేజ్మెంట్లను పేరెంట్స్ నిలదీస్తే, తాము చెప్పేది.. సర్కార్ సిలబస్ కన్నా స్టాండర్డ్ అంటూ చెప్తున్నాయి. 

రూ.700 బుక్స్ కు రూ.5 వేలు వసూలు..

వాస్తవానికి ఐదో తరగతిలోపు 4 పుస్తకాలు, ఆరు నుంచి పదో తరగతి వరకు 6 నుంచి 10 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. కానీ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రం15 నుంచి 18 ఉంటున్నాయి. వీటితో పాటు స్టడీ మెటీరియల్ అంటూ మరికొన్ని ఇస్తున్నాయి. వాటిని తమవద్దనే కొనాలని పేరెంట్స్పై ఒత్తిడి చేస్తున్నాయి. ఆ పుస్తకాలు బయట ఎక్కడా దొరక్కపోవడంతో.. ఆయా స్కూళ్లలోనే కొనాల్సి వస్తోంది. ఇదే అదనుగా మేనేజ్‌మెంట్లు ఇష్టానుసారంగా పుస్తకాల రేట్లు పెంచుతున్నాయి. మార్కెట్లో టెన్త్ క్లాస్ పుస్తకాలన్నీ రూ.700 లోపే ఉంటాయి. కానీ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రం రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎల్ కేజీ, యూకేజీ పిల్లలకూ నాలుగైదు పుస్తకాలు కొనసాల్సిందేనని పేరెంట్స్కు హుకుం జారీ చేస్తున్నారు. దీనిపై విజయ్కుమార్ అనే ఆర్టీఐ యాక్టివిస్ట్ ఇటీవల నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఇదంతా తమకు తెలిసి జరుగుతున్నా పట్టించుకోని రాష్ట్ర సర్కార్.. దీనికి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.