ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో.. ఆసిఫాబాద్ క్రీడాకారిణి

ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో.. ఆసిఫాబాద్ క్రీడాకారిణి
  • కోచ్ రవికుమార్ సైతం..

కోల్​బెల్ట్/ఆసిఫాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని ఉప్పల్​ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన ఎగ్జిబిషన్​ మ్యాచ్​లో ప్రపంచ ఫుట్​బాల్ ​దిగ్గజం లియోనల్ మెస్సీతో ఆడే అవకాశం ఆదిలాబాద్​ఉమ్మడి జిల్లా క్రీడాకారుణికి దక్కింది. అసిఫాబాద్​ జిల్లా కేంద్రంలోని ట్రైబల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ గర్ల్స్​ స్కూల్​లో తొమ్మిదో తరగతి స్టూడెంట్​ సీహెచ్.ఆర్తి.. లియోనల్ ​మెస్సీ, సీఎం రేవంత్ ​రెడ్డితో కలిసి ఫుట్​బాల్​ ఆడింది. 

ఫుట్​బాల్​ కోచ్​గా పనిచేస్తున్న మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​కు చెందిన సీనియర్ క్రీడాకారుడు సప్పిడి రవికుమార్ ​నేతృత్వంలో సింగరేణి ఆర్ఆర్ ​టీం తరఫున పాల్గొన్నారు. ఆర్తీకి 2023–24 లో నేషనల్ లెవల్ ఫుట్​ బాల్ టోర్నీలో ఆడిన అనుభవం ఉంది. ఫుట్​బాల్​దిగ్గజం మెస్సీతో జరిగిన ఎగ్జిబిషన్​ మ్యాచ్​లో తమ స్కూల్​కు చెందిన క్రీడాకారుణి ఆర్తీతోపాటు తాను పాల్గొనడంపై కోచ్​రవికుమార్ ​ఆనందం వ్యక్తం చేశారు. మెస్సీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం మరిచిపోలేని అనుభూతి అని ఉబ్బితబ్బిబ్బయ్యారు.