టాలీవుడ్ టాలెండ్ హీరో ప్రియదర్శి (Priyadarshi) పరిచయం అక్కర్లేని పేరు. మల్లేశం సినిమాతో ప్రతి ఇంటి తలుపుతట్టాడు.. ఆ తర్వాత వచ్చిన బలగం మూవీతో ప్రతిఇంటి వాడయ్యాడు. కెరీర్ మొదట్లో కమెడియన్గా టాలెంట్ ప్రూవ్ చేసుకుని.. ఇపుడు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ప్రియదర్శి హీరోగా నటించిన డార్లింగ్, 35 చిన్న కథకాదు, కోర్ట్ తదితర సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు.
ఈ క్రమంలోనే ప్రేమంటే (Premante) చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించారు. 2025 నవంబర్ 21న థియేటర్లోకి వచ్చిన ప్రేమంటే ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. లేటెస్ట్గా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ప్రేమంటే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వెల్లడిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ‘అందమైన వైభవాల వేడుకే కదా ప్రేమంటే’ అని తెలిపింది.
‘ప్రేమంటే’OTT:
కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్గా నటించింది. సుమ కనకాల కీలక పాత్ర పోషించింది.
పెళ్ళికి ముందు ప్రేమ వేరు. ప్రేమలో కొన్ని దాగుడుమూతలు ఆటలుంటాయి. కొన్ని నిజాలు దాచిపెడుతుంటాం. కానీ, ప్రేమ తర్వాత పెళ్లివేరు. కలిసి జీవితం పంచుకుంటాం. అంటే, ఎలాంటి దాపరికం లేకుండా మనసులు ముడేసుకుంటాం. అలా వివాహ బంధం మొదలుపెట్టాక ఒకరికొకరికి అన్నీ తెలిసిపోతాయి. తప్పొప్పులు అయితే, మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ క్రమంలో భర్తలో కొత్త మార్పులు వచ్చినప్పుడు, భార్య ఎంచుకున్న మార్గం ఎలాంటిది అనేది ప్రేమంటే మూవీ.
అనుమానానికి దారీ తీసే మార్పులు ఏంటంటే.. ఫోన్ రాగానే భర్త బయటకు వెళ్లి మాట్లాడటం, ఆ విషయం భార్యలో అనుమానాన్ని రేకెత్తించడం, ఇరుగు పొరుగు ఆ అనుమానానికి ఆజ్యం పోయడం వంటివి. కానీ, ఇలాంటివి ఉంటూనే.. ఆలోచింపజేసే కథతో నడుస్తుంది ప్రేమంటే.. ప్రియదర్శి, ఆనంది జంటగా కనిపించి, కొత్త దంపతుల జీవితంలో జరిగే సన్నివేశాలని అలరించేలా చూపించారు. కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన తర్వాత, వారి మధ్య నెలకొన్న సమస్యలు, భావోద్వేగాలు ఇందులో చక్కగా ప్రజెంట్ చేశారు. భర్త దొంగగా మారితే.. ఏ భార్య అయిన.. అతన్ని (భర్తను) మార్చుకోడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ మూవీలో భార్య అలా కాదు. భర్త దొంగని తెలిసి.. భర్త సమస్యలను అర్థం చేసుకొని.. భర్తకు సాయంగా తాను కూడా దొంగలా మారుతుంది. భర్త బలహీనతను, తాను చేసే ఎథికల్ దొంగతనాలకు సపోర్ట్ చేసి, తన వెంట ప్రయాణం సాగిస్తుంది.
Andhamaina vaibhavala veduka ey kadha premante 🤩❤️ pic.twitter.com/NF7ic6xETm
— Netflix India South (@Netflix_INSouth) December 14, 2025
కథేంటంటే:
పెళ్లి తర్వాత లైఫ్ థ్రిల్లింగ్‌గా ఉండాలని కోరుకునే అమ్మాయి రమ్య (ఆనంది). అతి శుభ్రత అనే ఓ డిజార్డర్ ఉంటుంది. రమ్యకు థ్రిల్లింగ్ అనిపించే పనులు చేయాలంటే ఇష్టం. చదువు కంప్లీట్ చేసుకుని ఉద్యోగం చేస్తుంటుంది. మరోవైపు, తన కుటుంబం కోసం ఏమైనా చేయాలనే మనస్థత్వంతో ఉంటాడు మధుసూదన్ అలియాస్ మధి (ప్రియదర్శి). వీరిద్దరి ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి.పెళ్లి తర్వాత తమ లైఫ్ ఎలా ఉండాలో వీరిద్దరు ముందే ఊహించుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే తమ ఇంట్లో పెద్దవాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో ఒక కారణంతో రిజెక్ట్ చేస్తూ వస్తుంటారు రమ్య, మధుసూదన్. అలా ఓ పెళ్లిలో అనుకోకుండా రమ్య, మధుసూదన్లు కలుస్తారు. తర్వాత వారి అభిప్రాయాలూ, ఇష్టాలు, ఆలోచనలు కలుస్తాయి. ఇక వారిద్దరి మధ్య అన్నీ కలిసి రావడంతో మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతారు. అలా వారు ఊహించినట్టుగానే తమ కలల సామ్రాజ్యంలోకి అడుగుపెడతారు. మూడు నెలలు వివాహ జీవితం సజావుగా సాగుతుంది. ఇక ఆ తర్వాత వీరిద్దరి ప్రవర్తనలో మార్పులు వస్తాయి.
ఈ క్రమంలోనే రమ్య తన భర్త మధుసూదన్ గురించి ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకుంటుంది. దాంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. ఇక మధుసూదన్ నుంచి రమ్య వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. చివరగా భర్త మధుసూదన్కు మారడానికి.. ఒక్క అవకాశం ఇస్తుంది. మరొక సంఘటన తర్వాత, రమ్య ఒక ఊహించని డెసిషన్ తీసుకుంటుంది. అది మధుసూదన్కు బిగ్ షాక్ ఇస్తుంది.
అసలు రమ్య తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి? మధుసూదన్ చేసే పని ఏంటీ? ఆ పని గురించి తెలిశాక రమ్య ఎలా స్పందించింది? హెడ్ కానిస్టేబుల్ ఆశా మేరీ (సుమ).. వీరి మధ్యలోకి ఎలా రావాల్సి వచ్చింది? పెళ్లి తర్వాత వీరి ఊహించిన జీవితం ఎందుకు తలక్రిందులు అయింది? మొత్తానికి వీరిద్దరి వైవాహిక జీవితానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఇద్దరి మధ్య బంధం కొనసాగిందా? లేదా? అన్నది తెలియాలంటే ప్రేమంటే సినిమా చూడాల్సిందే.
