100 కేజీల కేక్ తో ఘనంగా పెంపుడు కుక్క బర్త్ డే

100 కేజీల కేక్ తో ఘనంగా పెంపుడు కుక్క బర్త్ డే

కర్ణాటకలో ఓ కుక్కకు ఘనంగా బర్త్ డే వేడుకలు నిర్వహించాడు యజమాని. 100 కేజీల కేక్ కట్ చేసి..5 వేలమందికి భోజనాలు పెట్టించాడు. బెళగావి జిల్లా తుక్కనట్టి గ్రామానికి చెందిన శివప్ప తన పెంపుడు కుక్క క్రిష్ ను అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. క్రిష్ బర్త్ డే సందర్భంగా గ్రామంలో 5 వేల మందికి పిలిపించి...100 కేజీల కేక్ కట్ చేయించాడు. వచ్చిన వారికి 300 కేజీల మాంసం,100 కేజీల గుడ్లు వండి పెట్టాడు. ఇక శాకాహరులకు 50 కేజీల నాన్ వెజ్ ను ఏర్పాటు చేశాడు. కేక్ కట్ చేసిన తర్వాత కుక్కను ఘనంగా ఊరేగించాడు.  శివప్ప 20 ఏళ్లుగా గ్రామపంచాయతీ సభ్యుడిగా ఉంటున్నాడు. అయితే కొత్త పంచాయతీ సభ్యుడు బర్త్ వేడుకులకు పిలిచి శివప్పను అవమానించాడట. దీంతో నిరసనగా తన పెంపుడు కుక్కకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాడు.