ఆక్స్ ఫర్డ్ టీకా డిసెంబర్ కు పక్కా..

ఆక్స్ ఫర్డ్ టీకా డిసెంబర్ కు పక్కా..
  • డిసెంబర్ కు  పక్కా చివరి దశలో ఫేజ్3 ట్రయల్స్
  • ఇంపీరియల్ కాలేజ్ లండన్ వ్యాక్సిన్ కూడా
  •  అక్టోబర్ నుంచే వ్యాక్సిన్లకు అప్రూవల్ ఇస్తామన్న బ్రిటన్ సర్కార్
  • అందుకు మెడిసిన్స్ రెగ్యులేషన్ చట్టంలోనూ మార్పులు

లండన్ : కరోనా వ్యాక్సిన్ డెవలప్ మెంట్లో మొదటి నుంచి ముందున్నది ఆక్స్ఫర్డ్ వ్యాక్సినే. చాలా కంపెనీలు, దేశాలు వ్యాక్సిన్పై ప్రయోగాలు చేస్తున్న టైంలోనే.. డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ తెచ్చేస్తామని ప్రకటించి ప్రపంచ దేశాలకు ఓ భరోసా ఇచ్చింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. అడినో వైరస్, కరోనా వైరస్లను కలిపి తయారు చేసిన ఆ వ్యాక్సిన్ పేరు చేడాక్స్1ఎన్కోవ్19. ఇప్పటికే చాలా దేశాల్లోవ్యాక్సిన్పై మూడో ఫేజ్ ట్రయల్స్ స్టార్ట్అయ్యాయి. జూన్లోనే బ్రిటన్, బ్రెజిల్వంటి దేశాల్లోపెద్ద సంఖ్యలో వలంటీరీలపై ట్రయల్స్ నడుస్తున్నాయి. అవిప్పుడు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ఆ ట్రయల్స్కు సంబంధించిన రిజల్ట్ను పబ్లిష్ చేసి.. వ్యాక్సిన్ తయారీకి అప్రూవల్ పొందాలని ఆక్స్ ఫర్డ్యూనివర్సిటీ వేగంగా అడుగులు వేస్తోంది. తద్వారా డిసెంబర్నాటికి ప్రపంచ దేశాలకు వ్యా క్సిన్ ఇవ్వాలన్నలక్ష్యాన్ని పక్కాగా చేరాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఇండియాలోనూ ఆ వ్యా క్సిన్ పై  థర్డ్ ఫేజ్ ట్రయల్స్ మొదలయ్యాయి. ముగ్గురికి వ్యాక్సిన్ ఇవ్వగా అంతా బాగానే ఉన్నట్టు తేలింది. బ్రిటన్లో ఇంకో వ్యాక్సిన్ పైనా వేగంగా ట్రయల్స్ జరుగుతున్నాయి . ఇంపీరియల్ కాలేజ్ లండన్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ కూడా ఫేజ్3 ట్రయల్స్కు చేరుకుంది.

హెల్త్ వర్కర్స్ ఆర్మీ

వ్యాక్సిన్లకు అనుమతిచ్చాక వాటిని వీలైనంత ఎక్కువ మంది జనాలకు ఇచ్చేందుకు హెల్త్ వర్కర్లతో ఆర్మీనీ రెడీ చేస్తోంది బ్రిటన్ సర్కార్. నర్సులతో పాటు ఫార్మాసిస్టులు, మిడ్వైవ్స్ (గర్భిణులు, అప్పుడే పుట్టిన పిల్లలు, బాలింతలను జాగ్రత్తగా చూసుకునేవాళ్లు), ఫిజియోథరపిస్టులకూ వ్యాక్సి న్ ఇవ్వడంపై ట్రైనింగ్ ఇవ్వనుంది. ఇప్పటికిప్పు డు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. జనాలకు ఆ వ్యాక్సిన్ను వేసేందుకు సిబ్బంది సరిపోరన్న ఆందోళనల నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాళ్లతో పాటు  పాటు మెడికోలు (డాక్టర్  దువుతున్నోళ్లు), ఎన్ హెచ్ఎస్లోని స్టాఫ్, డెంటిస్టులు, వెటర్నరీ డాక్టర్లనూ  వ్యాక్సినేషన్లో భాగం చేయాలని యోచిస్తున్నారు.

అక్టోబర్ నుంచే అప్రూవల్స్

వ్యాక్సిన్ను ఎవరు తొందరగా తీసుకొచ్చినా.. ఎమర్జెన్సీ వాడకానికి అనుమతిచ్చేస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు హ్యూమన్ మెడిసిన్స్ రెగ్యులేషన్స్ 2012 చట్టంలో కొన్ని మార్పులు చేసింది. స్టాండర్డ్స్ ఏ మాత్రం తగ్గకుండా ఉన్న వ్యాక్సిన్లకు అప్రూవల్ ఇచ్చేలా మెడిసిన్స్ అండ్ హెల్త్కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీకి పూర్తి అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది. ట్రయల్స్ లో మంచి ఫలితాలొచ్చిన వ్యాక్సిన్లకు అక్టోబర్ నుంచి అనుమతులు ఇవ్వబోతోంది.