కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని డిసైడ్ అయిన ఓయో

కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని డిసైడ్ అయిన ఓయో

న్యూఢిల్లీ: గ్లోబల్ ట్రావెల్ టెక్ సంస్థ ఓయో తన కంపెనీ- సర్వీస్డ్ హోటళ్లలో ఇన్-హౌస్ కిచెన్‌‌‌‌‌‌‌‌లు,  క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్​ఆర్​), ఫుడ్ అండ్ బేవరేజెస్​(ఎఫ్​అండ్​బీ)లను అందించాలని భావిస్తున్నట్టు తెలిపింది. 'టౌన్‌‌‌‌‌‌‌‌ హౌస్ కేఫ్' బ్రాండ్ పేరుతో క్యూఎస్​ఆర్​లను నిర్వహించనుంది. 2025–-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి దశలో 1,500  కంపెనీ -సర్వీస్డ్ హోటళ్లను  మొదలుపెట్టనుంది. హోటళ్ల  కస్టమర్లు "కిచెన్ సర్వీసెస్"ను ఎంచుకుంటే  ఓయో యాప్  వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌ల ద్వారా, ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా భోజనాన్ని ఆర్డర్ చేయవచ్చు. 

ఈ కొత్త వ్యాపారం వల్ల ఆదాయం 5–-10 శాతం పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.  ఓయో ప్రయోగాత్మకంగా ఈ సంవత్సరం జనవరి నుంచి ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్,  బెంగళూరు వంటి నగరాల్లోని 100 కంపెనీ -సర్వీస్డ్ హోటళ్లను ప్రారంభించింది. మంచి ఫలితాలు రావడంతో రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వీటిని ప్రారంభించాలని నిర్ణయించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, ఇండోర్, కోల్‌‌‌‌‌‌‌‌కతా, జైపూర్,  లక్నో వంటి కీలక నగరాల్లో ఎఫ్ అండ్​బీలను అందుబాటులోకి తెస్తామని ఓయో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వరుణ్ జైన్ అన్నారు.