దాదాపు 600 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు తెలిపిన ఓయో

దాదాపు 600 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు తెలిపిన ఓయో

న్యూఢిల్లీ: హాస్పిటాలిటీ కంపెనీ  ఓయో తన సిబ్బందిని తగ్గించే పనిలో పడింది. దాదాపు 600 మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు తెలిపింది. సంస్థలో  మొత్తం 3700 మంది పనిచేస్తున్నారు. అయితే కొత్తగా  కొంతమందిని  నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.   ప్రొడక్షన్​,  ఇంజనీరింగ్ టీమ్​ల,  ఓయో వెకేషన్ హోమ్స్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సైజును తగ్గిస్తోంది. పార్ట్​నర్​ రిలేషన్​షిప్​ మేనేజ్​మెంట్​, బిజినెస్ ​డెవెలప్​మెంట్​ టీమ్​లలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతోంది. పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అభివృద్ధి చేస్తున్న టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కొందరిని ఇంటికి పంపిస్తోంది.  యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమింగ్, సోషల్ కంటెంట్ క్యూరేషన్,  పాట్రన్ ఫెసిలిటేట్ కంటెంట్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కూడా సిబ్బందిని తగ్గిస్తోంది. 'పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్ సాస్​' వంటి ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సభ్యులను తీసేస్తోంది లేదా కోర్​ ప్రొడక్ట్​, టెక్​ ఏరియాల్లోకి మళ్లీ తీసుకుంటోంది.  

కంపెనీ తన కార్పొరేట్ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్వార్టర్​లోనూ ఉద్యోగులను తీసేస్తోంది. సమానమైన హోదా ఉన్న ఉద్యోగుల్లో కొందరిని తొలగిస్తోంది. టీమ్​లో సభ్యుల సంఖ్యను తగ్గిస్తోంది. రాజీనామాలు చేసిన వాళ్లు మరోచోటు ఉపాధి పొందేందుకు తాము చేయగలిగినదంతా చేస్తామమని ఓయో  గ్రూప్ సీఈఓ రితేష్ అగర్వాల్ భరోసా ఇచ్చారు. కంపెనీకి విలువైన సహకారం అందించిన చాలా మంది ప్రతిభావంతులను వదులుకోవడం దురదృష్టకరమని కామెంట్​ చేశారు. భవిష్యత్తులో వాళ్ల సేవలు అవసరమైతే  అవకాశం కల్పిస్తామని అన్నారాయన. పార్ట్​నర్​ రిలేషన్​షిప్​ మేనేజ్​మెంట్ విభాగాన్ని బలోపేతం చేయడానికి 250 మందిని చేర్చుకోనున్నట్లు తెలిపారు.