మోదీ అంటే..ఒక రోల్ మోడల్ : కంగనా రనౌత్

మోదీ అంటే..ఒక రోల్ మోడల్  :   కంగనా రనౌత్

ప్రధాని మోదీ అంటే..ఒక రోల్ మోడల్ అన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి  కంగనా రనౌత్. మహిళల అభివృద్ధికి మోదీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అందులో భాగంగానే తనకు టికెట్ వచ్చిందన్నారు. అంటే..మహిళలకు మోదీ ఏవిధంగా ప్రాధన్యాత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కంగనా. జూన్ 4 తర్వాత మహిళలకు మోదీ మరిన్ని పథకాలు ప్రవేశపెడతారన్నారు కంగనా రనౌత్. 

హిమాచల్ ప్రదేశ్ లోని మండి ఎంపీ సెగ్మెంట్ లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు కంగనా రనౌత్.  కాగా  కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మండి లోక్ సభ స్థానం నుంచి  బీజేపీ తరుపున  కంగన పోటీ చేస్తు్ండటంతో ఆసక్తికరంగా మారింది.   దివంగత మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ఇక్కడినుంచి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు.   జూన్ 1న మండిలో పోలింగ్ జరగనుంది.