తల్లిదండ్రులకు పాదపూజ

తల్లిదండ్రులకు పాదపూజ

తమ కంటిపాపలైన చిన్నారులు సున్నిత హస్తాలతో తమ పాదాలను కడుగుతుంటే ఆ తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. మరికొందరు తన్మయత్వానికి లోనై చిన్నారులను గుండెలకు హత్తుకున్నారు. ఇంకొందరు ఉబ్బితబ్బిబ్బై ఆనంద భాష్పాలు రాల్చారు. వేసవిశిక్షణ శిబిరంలో భాగంగా దోమలగూడ రామకృష్ణ మఠంలో చిన్నారులు తమ తల్లిదండ్రుల పాదాలు కడిగారు. శిక్షణ శిభిరంలో భాగంగాతల్లిదండ్రుల కాళ్లు కడిగే కార్యక్రమాన్ని రామకృష్ణ మఠంలో ఏటా నిర్వహిస్తు న్నారు. తల్లిదండ్రులను కుర్చీలపై కూర్చుం డబెట్టి చిన్నారులునేలమీద కూర్చు ని భక్తి శ్రద్ధలతో పాదాలుకడిగారు. అనంతరం కాళ్లపై పూలను ఉంచి పూజలు నిర్వహించారు. మెడలో పూలమాలలువేసి కాళ్లను పసుపు, కుంకుమతో అలంకరించారు. తర్వాత పాదాలను వస్త్రం తో శుభ్రంగా తుడిచి పాదాభివందనం చేశారు. తమ తల్లిదండ్రులు ఆయురారోగ్యాలతో జీవించాలని సకల సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. దీంతో తల్లిదండ్రులు ఆనందానుభూతులను వ్యక్తం చేశారు. తమ కన్నబి డ్డలు ఎల్లవేళలా సుఖంగా,సంతోషంగా ఉండాలని, భవిష్యత్‌ లో వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. 15 రోజుల వేసవి శిక్షణ శిభిరంలో భాగంగా తమ పిల్లలు ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నారని పలువురు తల్లిదండ్రులు తెలిపారు. సంస్కా రం, సత్‌ ప్రవర్తన, క్రమశిక్షణ, వ్యక్తిత్వవికాసం, నాయకత్వ లక్షణాలు అలవర్చు కున్నారని తెలిపా రు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని చెప్పా రు. పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచడమే గాకుండా వారిని సంస్కా రవంతులుగా తీర్చిదిద్దడమే వేసవి శిక్షణ తరగతుల లక్ష్యమని రామకృష్ణ మఠం స్వామీజీ బోధమయానంద తెలిపారు. వేసవి శిక్షణ శిభిరాలు ముగిసిన తర్వాత కూడా విభిన్న వయసుల వారికి అనేక రకాల కోర్సులు నేర్పిస్తు న్నామని వివరించారు. వ్యక్తిత్వ వికాసం,నాయకత్వ లక్షణాలు, యోగా, ధ్యానం, ఆధ్యాత్మికత అంశాల్లో తర్పీ దునిస్తు న్నామని చెప్పా రు.తాము నిర్వహిస్తు న్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. వారు ఉన్నత శిఖరాలకు చేరుకుని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలనే అంశాలు ప్రధాన ఉద్దేశంగా రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణ శిభిరాలు నిర్వహిస్తు న్నట్లు వివరించారు. విద్యార్ థులతోపాటు వారి తల్లిదండ్రులకు కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తు న్నామన్నారు. రామకృష్ణ మఠంలో ప్రతి సంవత్సరం నిర్వహించే శిక్షణ శిభిరాలకు విశేషమైన ఆదరణ ఉంది. ఒకప్పుడు వందల్లో వచ్చే విద్యార్థుల సంఖ్య ఇప్పుడు వేలకు చేరుతున్నది.