పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌‌‌‌‌‌‌‌గా పబ్బ సురేశ్ బాబు

పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌‌‌‌‌‌‌‌గా పబ్బ సురేశ్ బాబు
  •     పీసీఐ తొలి మహిళా అధ్యక్షురాలిగా పిషారోటి ఎన్నిక 

న్యూఢిల్లీ, వెలుగు: ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ) తొలి మహిళా అధ్యక్షురాలిగా సంగీతా బరూవా పిషారోటి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో పిషారోటి బృందం కార్యనిర్వాహక, మేనేజింగ్ కమిటీలోని అన్ని పదవులను కైవసం చేసుకుంది. 

ఇందులో పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన పబ్బ సురేశ్ బాబు రెండోసారి విజయం సాధించారు. ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్యానెల్ దేశవ్యాప్తంగా జర్నలిస్తుల హక్కుల కోసం పార్లమెంట్ వేదికగా పోరాడుతుందని చెప్పారు. 

జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌లపై ఎలాంటి దాడులు, సంఘటనలు జరిగిన ఖండించడంతో పాటు.. వారికి న్యాయం చేకూర్చడంలో ముందుందని పేర్కొన్నారు. ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టుల వాయిస్ వినిపించేందుకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని వెల్లడించారు. తన గెలుపుకోసం సహకరించి ఓట్లతో మద్దతు తెలిపిన పీసీఐ మెంబర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.