కౌశిక్ రెడ్డితోనే యుద్ధం.. కేసీఆర్ అంటే గౌరవం: అరికపూడి గాంధీ

కౌశిక్ రెడ్డితోనే యుద్ధం.. కేసీఆర్ అంటే గౌరవం: అరికపూడి గాంధీ

హైదరాబాద్: తనకు ఎమ్మెల్యే  పాడి కౌశిక్ రెడ్డితోనే యుద్ధమని పీఏసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఇది బీఆర్ఎస్ కు గాంధీకి యుద్ధం కాదని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఉదయం మీడియాతో ఆయన మాట్లాడారు. నిన్న ఉదయం 11 గంటలకు నా ఇంటికి వస్తానని కౌశిక్‌రెడ్డి చెప్పారని తెలిపారు.  రాలేదు. దీంతో తానే వాళ్ల ఇంటికి నేనే వెళ్లానని చెప్పారు.  

ALSO READ | టెన్షన్.. టెన్షన్ : అరెకపూరడి గాంధీ ఇంటి దగ్గర బీఆర్ఎస్ నిరసన

కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వచ్చి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారన్నారు.  ఓ మోసకారి మాటలు ఎంతకాలం పడాలని ప్రశ్నించారు. అందుకే స్పందించానని క్లారిటీ ఇచ్చారు. తనకు కేసీఆర్‌ అంటే గౌరవమని చెప్పారు. వ్యక్తిగతంగా మాత్రమే కౌశిక్‌రెడ్డితో తనకు యుద్ధమని అన్నారు. సమవుజ్జీ కాని ఆయన ఇంటికి వెళ్లినందుకు ఒకరకంగా బాధపడుతున్నాని అన్నారు.  హరీశ్‌రావు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు.