
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 7,035 సెంటర్లలో కొనుగోళ్లు చేపట్టగా, ఇప్పటి వరకు 2,687 సెంటర్లలో పూర్తయ్యాయి. ఇంకా 4,348 సెంటర్లలో కొనుగోళ్లు పూర్తి కావాల్సి ఉంది. సివిల్ సప్లయ్స్ డిపార్ట్‌మెంట్ ఇప్పటి వరకు 56.29 లక్షల టన్నుల వడ్లు కొన్నది.
వాస్తవానికి యాసంగి దిగుబడి కోటి 40 లక్షల టన్నులు అని ప్రభుత్వం అంచనా వేయగా, ఇందులో 80 లక్షల టన్నుల వడ్లు కొనాలని నిర్ణయించింది. తాజాగా ఆ టార్గెట్‌ను తగ్గించి మొత్తం 62.16 లక్షల టన్నులు మాత్రమే కొనాలని డిసైడ్ అయింది.