ఖిలావరంగల్(మామునూర్)/ నల్లబెల్లి/ వెంకటాపూర్(రామప్ప), వెలుగు: వడ్ల కొనుగోళ్లు ముమ్మరమయ్యాయి. సోమవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్, బొల్లికుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ వైస్ చైర్మన్ సోల్తి భూమాత రామస్వామి, కార్పొరేటర్ గద్దె బాబు ప్రారంభించారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజ్పల్లిలో నర్సంపేట మార్కెట్‌కమిటీ చైర్మన్ పాల్వయి శ్రీనివాస్, ములుగు జిల్లా వెంకటాపూర్మండలం నర్సింగాపూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేద సారంగపాణి కొనుగోళ్లను మొదలు పెట్టారు.
