రైస్ మిల్లులో నిల్వ చేసిన వడ్లు తడిసిపోయినయ్

రైస్ మిల్లులో నిల్వ చేసిన వడ్లు తడిసిపోయినయ్

సిద్దిపేట జిల్లాలో కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రైస్ మిల్లుల్లో నిల్వ చేసిన వడ్లు తడిసిపోయాయి. ఆరుబయటే వడ్లు పోయడంతో ధాన్యం తడిసి ముద్దయింది. కొన్ని చోట్ల వడ్లు మొలకెత్తాయని రైస్ మిల్లుల యజమానులు చెబుతున్నారు. 
ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి 3వేల కోట్లు చెల్లించి ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసిందని తెలిపారు. ధాన్యం తడిసిపోవడంత భారీ నష్టం ఏర్పడిందని చెప్పారు. ఈ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమపై వేస్తుందేమోనని మిల్లుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.