లక్నో: రంజీ ట్రోఫీలో కర్నాటక ఫైనల్ దిశగా దూసుకెళ్తోంది. ఉత్తరాఖండ్‌తో సెమీఫైనల్లో కెప్టెన్ దేవదత్ పడిక్కల్ (232) డబుల్ సెంచరీతో విజృంభించడంతో సోమవారం, రెండో రోజు చివరకు తొలి ఇన్నింగ్స్‌లో 689/6 భారీ స్కోరుతో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 355/2తో ఆట కొనసాగించిన కర్నాటకను పడిక్కల్‌తో, స్మరణ్ రవిచంద్రన్ (121) ముందుకు తీసుకెళ్లారు.
కరుణ్ నాయర్ (60), కృతిక్ (60) కూడా రాణించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌తో రెండో సెమీస్‌లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 328 రన్స్‌కు ఆలౌటైంది. సుదీప్ కుమార్ ఘరామి (146) సెంచరీతో మెరిశాడు. ఆకిబ్ నబీ (5/87) ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన జమ్మూ రెండో రోజు చివరకు 198/5 స్కోరుతో పోరాడుతోంది. షమీ (3/60) మూడు వికెట్లతో దెబ్బకొట్టాడు.
