
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. " ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశాను" అంటూ పద్మారావు గౌడ్ ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా పద్మారావు గౌడ్ బీజేపీలో చేరనున్నారంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో కేటీఆర్ ను ఆయన కలిసినట్లు తెలుస్తోంది.
తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని పద్మారావు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్ధానాన్ని మొదలు పెట్టిన పద్మారావు గౌడ్ టీఆర్ఎస్ లో చేరారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారి మంత్రి అయ్యారు. రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు.