హైదరాబాద్సిటీ, వెలుగు: బాలికా సాధికారతే తమ లక్ష్యమని లీలా పూనావాలా ఫౌండేషన్ చైర్పర్సన్, పద్మశ్రీ లీలా పూనావాలా తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో ఆదివారం విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్కాలర్షిప్లు అందించడమే కాకుండా మెంటార్షిప్, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాల వృద్ధి ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కాన్సెంట్రిక్స్ హైదరాబాద్, వైజాగ్ సర్వీస్ డెలివరీ, ఆపరేషన్స్ హెడ్ హుస్సేన్ సయ్యద్ పాల్గొన్నారు.
