పద్మ పురస్కారాన్ని తిరస్కరించిన లెజెండరీ సింగర్

పద్మ పురస్కారాన్ని తిరస్కరించిన లెజెండరీ సింగర్

కోల్కతా: బెంగాలీ వెటరన్ గాయకి, 90 ఏళ్ల సంధ్యా ముఖర్జీ కేంద్రం ప్రకటించిన పద్మ శ్రీ పురస్కారాన్ని తిరస్కరించారు. తన స్థాయికి ఈ అవార్డు సరికాదన్న ఆమె.. పురస్కారాన్ని జూనియర్ ఆర్టిస్ట్కు ఇవ్వడం మేలన్నారు. 'ఈ వయసులో అవార్డు ఇవ్వడం ద్వారా నన్ను అవమానించారు' అని ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన సీనియర్ అధికారితో తన తల్లి చెప్పారని సంధ్య కూతురు సౌమీ సేన్ గుప్తా తెలిపారు. తన తల్లి తీసుకున్న నిర్ణయంతో రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

కాగా, ఈ ఏడాది కేంద్ర సర్కారు ప్రకటించిన పద్మ అవార్డును తిరస్కరించిన రెండో బెంగాలీ సంధ్యా ముఖర్జీ కావడం గమనార్హం. ఇప్పటికే ఆ రాష్ట్ర మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య పద్మ పురస్కారాన్ని అందుకోబోనని ప్రకటించారు. తనకు ఈ పురస్కారం వచ్చిందన్న విషయం తెలియదని.. అవార్డు లిస్టులో పేరుందని ముందే తెలిస్తే వద్దనే వాడ్నని బుద్ధదేవ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం: 

దేశంలో ఒకే మతం, ఒకే భాష ఉండాల్నా?

హీరో చిరంజీవికి కరోనా పాజిటివ్