హౌసింగ్ విజిలెన్స్ రిపోర్ట్ పై చర్యలు తీసుకోండి : పద్మనాభరెడ్డి

హౌసింగ్ విజిలెన్స్ రిపోర్ట్ పై చర్యలు తీసుకోండి : పద్మనాభరెడ్డి

హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ బోర్డుకు చెందిన రూ.5 వేల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ డెవలపర్లకు కట్టబెట్టిన స్కామ్ పై విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసైని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్ జీజీ) ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి కోరారు. ఈ అంశంపై 2013 లోనే విజిలెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరిందని గుర్తుచేశారు.

రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ బోర్డును ప్రభుత్వం ఆదేశిస్తే ఇంత వరకు చర్యలు లేవని చెప్పారు.  ఇప్పటికైనా ఈ స్కామ్ పై విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు పద్మనాభరెడ్డి గురువారం లెటర్ రాశారు. 2001లో కూకట్ పల్లి, గచ్చిబౌలిలో 98.5 ఎకరాలను 4 ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం డెవలప్ మెంట్ కు ఇచ్చింది.

2004లో అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. ఈ ల్యాండ్స్ లలో డెవలప్ చేసి సగం హౌసింగ్ బోర్డుకు ఇచ్చేలా అగ్రిమెంట్ జరిగింది. కానీ అగ్రిమెంట్ ను ప్రైవేట్ కంపెనీలు ఉల్లంఘించాయని పద్మనాభరెడ్డి ఆరోపించారు.  అయినా ప్రైవేట్ కంపెనీలపై అధికారులు చర్యలు తీసుకోలేదని తన లేఖ ద్వారా వివరించారు. ఇందులో అప్పటి కమిషనర్ మహంతి, సూర్యనారాయణ రాజుల పాత్ర ఉందని పేర్కొన్నారు.