ఎన్నికల కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడంలో తెలంగాణ ఫస్ట్: పద్మనాభ రెడ్డి

ఎన్నికల కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడంలో తెలంగాణ ఫస్ట్: పద్మనాభ రెడ్డి

ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ లక్డికపూల్ లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రొజెక్టర్ ద్వారా రూపొందించిన వీడియోలను అధ్యక్షులు పద్మనాభ రెడ్డి విడుదల చేశారు. 

భారత దేశంలోనే ఎన్నికల కోసం అత్యధిక ఖర్చు పెట్టే రాష్ట్రం తెలంగాణ అని ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి అన్నారు. ఎన్నికల కోసం రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు ఓటును అమ్ముకోవద్దని సూచించారు. ఎన్నికల నోటిఫికషన్ వచ్చిన తరువాత 25 వేల కంటే ఎక్కువ ఎవరు డబ్బు తీసుకొని వెళ్ళినా వారిపై ఎన్నికల కమిషన్ పోలీసులు కేసు పెట్టాలని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు తర్వాత లిక్కర్ ప్రభావం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. 

ఎన్నికల రోజు, ఫలితాల రోజు మాత్రమే లిక్కర్ షాపులు బంద్ చేస్తున్నారని కానీ అలా కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి లిక్కర్ షాపులను బంద్ చేయాలని పద్మనాభ రెడ్డి తెలిపారు. కరోనా టైంలో లిక్కర్ షాపులను నెల రోజులు బంద్ చేసినట్లు ఇప్పుడు కూడా బంద్ చేయాలన్నారు. డబ్బుకు, మద్యంకు ప్రజలు లొంగిపోకుండా నిజాయితీగా ఓటు వేయాలని చెప్పారు. 

అలా ఐతేనే తమ సమస్యలపై నాయకున్ని ప్రశ్నించగలుగుతారని స్పష్టం చేశారు. ఓటర్లకు అవగాహన కలిగేలా భవిష్యత్తులో మరిన్ని వీడియోలు విడుదల చేస్తామని పద్మనాభ రెడ్డి తెలిపారు.