సిరిసిల్లలో రోడ్డెక్కిన పద్మశాలీలు.. రాజకీయ పార్టీలకు హెచ్చరిక

సిరిసిల్లలో రోడ్డెక్కిన పద్మశాలీలు.. రాజకీయ పార్టీలకు హెచ్చరిక

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం పొలిటికల్ హీట్ మొదలైంది. మాకు ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇవ్వడం లేదంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పద్మశాలీలు రోడ్డెక్కారు. నెల రోజుల క్రితమే అభ్యుర్థులను ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ.. సిరిసిల్ల టికెట్ మళ్లీ కెటిఆర్ కే ప్రకటించింది. ఇటీవల 55మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో సిరిసిల్ల టికెట్ కు కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టింది.దీంతో కాంగ్రెస్ రెండో జాబితాపై పద్మశాలీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, సుదీర్ఘ చర్చల అనంతరం బీజేపీ హైకమండ్.. 52మంది కూడిన తొలి జాబితాను ప్రకటించింది. 

అయితే, సిరిసిల్ల టికెట్ ను రాణి రుద్రమ రెడ్డికి కేటాయించడంతో పద్మశాలీలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో సిరిసిల్లో రోడ్డెక్కి కొట్లాడేందుకు పద్మశాలీలు సిద్ధమయ్యారు.  2023, అక్టోబర్ 24వ తేదీ మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పద్మశాలీయుల నిరసన చేపట్టారు. రాజకీయ పార్టీలు తమను గుర్తించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పార్టీల దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు. రాజకీయ పార్టీలు పద్మశాలలీను గుర్తించి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. పద్మశాలిలకు టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిపించుకుంటామని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో ఓసీలకు 26 సీట్లు దక్కాయి. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి 17 సీట్లు వచ్చాయి. వెలమ వర్గానికి 7 సీట్లు, బ్రాహ్మణ వర్గానికి 2 సీట్లు దక్కాయి. మైనార్టీలకు 3 సీట్లు ఇవ్వగా… బీసీలకు 12 సీట్లు ఇచ్చారు. ఎస్సీలకు 12, ఎస్టీలకు 2 సీట్లు స్థానాలు ఖరారు చేశారు.

ALSO READ :- బాబోయ్ ఇంత రేటా : హైదరాబాద్ లో ఆల్ టైం హైకి బంగారం ధరలు